మళ్లీ సొంతగూటికి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
TeluguStop.com
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మళ్లీ సొంతగూటికే చేరారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ టికెట్ ఇస్తారన్న హమీతో వారం రోజుల క్రితం బీఆర్ఎస్ ను వీడిన రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
అయితే టికెట్ దక్కకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్ గూటికే చేరారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావు సమక్షంలో రామ్మోహన్ గౌడ్ దంపతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాగా గత రెండు ఎన్నికల్లోనూ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచారన్న సంగతి తెలిసిందే.
చేరిక అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
అలాగే ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.
బన్నీ అరెస్ట్ ముందూ వెనుక జరిగింది ఇదే.. ఈ వివాదం విషయంలో ట్విస్టులివే!