వరదల్లో బురద రాజకీయం : జగన్ చేస్తోంది కరెక్టే గా ?

ఏపీలో గోదావరి నది మహా ఉగ్ర రూపానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

ఇప్పటికీ అక్కడ ప్రజలు పూర్తిస్థాయిలో కోలుకోలేని పరిస్థితి.ఇళ్లు, పొలాలు నీట మునిగి ఎంతమంది దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ముఖ్యంగా  గోదావరి పరివాహక ప్రాంతాలు ఈ వరదల కారణంగా అతలాకుతలం అయ్యాయి.ప్రభుత్వం వరద బాధితులకు తక్షణసాయంగా రెండు వేల రూపాయల నగదు ,25 కేజీల బియ్యంతో పాటు , కొన్ని నిత్యవసర సరుకులను అందించింది.

ఇక ఏపీ సీఎం జగన్ సైతం వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

అయితే ఇక్కడే అసలు సిసలైన రాజకీయం మొదలైంది.యువకుడిగా ఉన్న జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించకపోవడం పై విపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయి.

    ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పరిమితం అయిపోయారని, ఏడు పదుల వయసు దాటినా చంద్రబాబు యువకుడిలా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారని,  జగన్ ఆ పని చేయలేకపోతున్నారని, ముఖ్యమంత్రిగా ఆయన విఫలం అయ్యారు అంటూ విపక్షాలు విమర్శలతో గత కొద్ది రోజులుగా హోరెత్తిస్తున్నాయి.

వైసిపి నేతల్లోనూ ఇదే రకమైన అభిప్రాయం దాదాపు కనిపిస్తోంది.వైసిపి అధికారంలోకి రాకముందు పాదయాత్ర పేరుతో జనాల్లోకి జగన్ సుదీర్ఘకాలం పాదయాత్ర నిర్వహించారు.

కానీ అధికారం దక్కిన తర్వాత ఎక్కువగా క్యాంపు కార్యాలయానికి పరిమితమైపోతున్నారు తప్ప, జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు.

    """/"/ ఇప్పుడు గోదావరి వరదలు సందర్భంగా జగన్ జనాల్లోకి వస్తారు అనుకున్నా, క్యాంపు కార్యాలయానికి పరిమితం అవుతుండడం, ఇప్పుడు హడావిడిగా జగన్ రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు .

అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని జగన్ అభిప్రాయపడుతున్నారు తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే అధికారులు మొత్తం తన పర్యటన ఏర్పాట్ల లో నిమగ్నం అవుతారని,  బాధితులకు వరద సాయం సరిగా అందదు అనే ఉద్దేశంతో జగన్ ఆ సమయంలో  పర్యటించేందుకు ఇష్టపడలేదు.

కానీ ఎప్పటికప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, వరద సాయం అందడం, వరద నష్టాన్ని అంచనా వేయించడం ఇంకా అనేక ప్రాంతాలు ముంపుకు గురవకుండా చూడడం వంటి వ్యవహారాలను చేపట్టారు.

ఇప్పుడు వరద ప్రభావం బాగా తగ్గింది.దీంతో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు.

ఒకరకంగా జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.వరదల సమయంలో నేరుగా జగన్ ప్రజల వద్దకు వెళ్లినా, పెద్దగా ఉపయోగం ఉండదు.

వరద నష్టం అంచనా వేయడానికి కనీసం వారం సమయం పడుతుంది.వరల సమయంలో తాను నేరుగా లేకపోయినా అధికారుల ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు.

 .

నాగ్ అశ్విన్ వల్లే అశ్వినీ దత్ సక్సెస్ లను అందుకుంటున్నారా..?