నల్లగా ఉన్నానని నన్ను దారుణంగా అవమానించారు.. ముచ్చర్ల అరుణ!

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ అయినా ముచ్చర్ల అరుణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోయినప్పటికీ, ఆ తరం ప్రేక్షకులు మాత్రం ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అందం,అభినయం కలబోసిన తెలుగు హీరోయిన్ లలో ముచ్చర్ల అరుణ కూడా ఒకరు.

1981లో విడుదల అయిన సీతాకోకచిలుక సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి అంటే ఆ సినిమా ఎంత సక్సెస్ ను సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

సీతాకోక చిలుక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ను సంపాదించుకుంది ముచ్చర్ల అరుణ.

తెలుగులో చంటబ్బాయి, స్వర్ణకమలం,సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ముచ్చర్ల అరుణ.

అలా అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అరుణ కేవలం పది సంవత్సరాల నుండి 70కి పైగా సినిమాల్లో నటించి నటిగా సత్తాను నిరూపించుకుంది.

"""/" / ఇక హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే ఈమె బిజినెస్ మాన్ మోహన్ గుప్త ని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఈ దంపతులకు నలుగురు సంతానం.ప్రస్తుతం ముచ్చర్ల అరుణ అమెరికాలో సెటిల్ అయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అరుణ మాట్లాడుతూ తన కలర్ కు సంబంధించి వచ్చిన విమర్శలపై స్పందించింది.

సినిమా షూటింగ్ లో ఈ అమ్మాయి ఏంటి ఇంత నల్లగా ఉంది అనే నా ముందే అన్నారు.

నాతో షూట్ చేయడానికి కూడా ఆలోచన చేశారు.ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను తర్వాత నేను ఒక సందర్భంలో జయప్రద గారిని చూశాను.

ఆమె మల్లె పువ్వు లాగా తెల్లగా చాలా అందంగా కనిపించారు నిజంగా నేను చాలా నల్లగా ఉన్నాను కదా నల్లగా ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రాకూడదు అని ఆ సమయంలో అనుకున్నాను అంటూ బాధ పడింది.

భగవంతుడు ఇచ్చిన రంగు చేతుల్లో ఏముంది అని చెప్పుకొచ్చింది ముచ్చర్ల అరుణ.

ట్రాఫిక్ రోడ్లపై పరుగెత్తుతూ భయపెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..