ఎమ్మెస్ నారాయణ చిన్నతనంలో ఆ పని చేసేవారా..?
TeluguStop.com
వెండితెరపై వందల సంఖ్యలో సినిమాల్లో నటించి తన కామెడీతో మెప్పించిన నటుడు ఎమ్మెస్ నారాయణ అనే సంగతి తెలిసిందే.
ఎమ్మెస్ నారాయణ అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ కాగా మా నాన్నకు పెళ్లి సినిమాతో ఎమ్మెస్ నారాయణ గుర్తింపును సొంతం చేసుకున్నారు.
తాగుబోతు పాత్రల్లో ఎక్కువగా నటించిన ఎమ్మెస్ నారాయణ రెండు సినిమాలకు దర్శకునిగా కూడా పని చేశారు.
2015 సంవత్సరంలో ఎమ్మెస్ నారాయణ అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు.చిన్న వయస్సులో ఎమ్మెస్ నారాయణ ఎన్నో నాటకాలను రచించారు.
సినిమాల్లోకి రాకముందు ఎమ్మెస్ నారాయణ టీచర్ గా పని చేశారు.ప్రేక్షకుల హృదయాల్లో చోటును సంపాదించుకున్న ఎమ్మెస్ నారాయణ ఒక సందర్భంలో మాట్లాడుతూ తన బాల్యం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
16 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో తాను వీధిలో దొరలు అనే నాటకంను రచించానని ఎమ్మెస్ నారాయణ అన్నారు.
"""/"/
తాను ఆ సమయంలో పశువులు కాసేవాడినని తాను రాసిన నాటికలో నటించి తనతో పాటు పశువులు కాసేవాళ్లకు చూపించానని ఎమ్మెస్ నారాయణ చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ఆ నాటికను స్టేజ్ పై వేసి చూపించానని ఎమ్మెస్ నారాయణ చెప్పుకొచ్చారు.
ముఖానికి మేకప్ అలానే ఉండటంతో ఇంటికి భయపడుతూ వెళ్లానని ఇంటికి వెళ్లి ఇంట్లో జాగ్రత్తగా భోజనం చేసి నిద్రపోయానని ఎమ్మెస్ నారాయణ చెప్పారు.
"""/"/
ఉదయం నిద్ర లేచే సమయానికి మేకప్ దుప్పటికి అంటుకుందని అలా జరగడంతో నాన్న నన్ను బాగా కొట్టారని ఎమ్మెస్ నారాయణ అన్నారు.
అయితే తనను కళామతల్లి కరుణించిందని తనను కమెడియన్ గా ఈ స్థాయిలో నిలబెట్టిందని ఎమ్మెస్ నారాయణ చెప్పుకొచ్చారు.
ఎమ్మెస్ నారాయణ సినిమాల్లోని కామెడీ వీడియోలు ఇప్పటికీ యూట్యుబ్ లొ లక్షల సంఖ్యలో వ్యూస్ ను అందుకుంటున్నాయి.
ఒక్కరోజు జైలు జీవితం బన్నీని భయపెట్టిందా.. ఇకపై ఆ తప్పు అస్సలు చెయ్యరా?