ఎంఎస్ ధోనీ యమహా బైక్ చూశారా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

ఎంఎస్ ధోనీ మోటర్‌బైక్‌లను ఎంతగా లవ్ చేస్తాడో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

ఈ స్టార్ క్రికెటర్ గ్యారేజ్‌లో చాలా బైక్స్ ఉన్నాయి.బైక్‌లు కలెక్ట్ చేయడంలో తన కంటే మరే వ్యక్తి ముందు ఉండరేమో అనేంతలా ఈ స్టార్ ప్లేయర్ బైక్స్ కలెక్ట్ చేస్తుంటాడు.

ధోనీ దగ్గర 40 ఏళ్ల కిందటి యమహా ఆర్‌డీ350 ఎల్‌సీ కూడా ఉంది.

ఈ రోజుల్లో ఈ బైక్ పైన వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పొచ్చు.

కాగా ధోనీ తాజాగా ఈ ఓల్డ్ బైక్‌ను నడుపుతూ కనిపించాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ క్లిప్‌లో ధోనీ యమహా ఆర్‌డీ350 ఎల్‌సీని నడుపుతూ తన రాంచీ ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిపోయినట్లు కనిపించింది.

ధోనీ 2022లోనే ఈ యమహా ఆర్‌డీ350 ఎల్‌సీని కొనుగోలు చేశాడు.ఈ మిస్టర్ కూల్ వద్ద డజన్ల కొద్దీ ఓల్డ్, మోడర్న్ మోటార్‌సైకిళ్ల ఉండగా, యమహా ఆర్‌డీ350 ఎల్‌సీ అతనికి ఎంతగానో నచ్చుతుందట.

ఆర్‌డీ350 ఎల్‌సీ 1980లలో ఒక ఐకానిక్ మోటార్‌బైక్‌గా నిలిచింది.ఈ బైక్ 1980 నుంచి 1983 వరకు ప్రొడక్షన్‌లో ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆర్‌డీ350 ఎల్‌సీని భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయలేదు. """/"/ ధోనీ వంటి బైక్ ప్రియులు ఈ బైక్‌ను భారత్‌కు దిగుమతి చేసుకున్నారు.

యమహా ఆర్‌డీ350 ఎల్‌సీ 2-స్ట్రోక్, పారాలెల్-ట్విన్, 347cc ఇంజన్‌తో 49 బీహెచ్‌పీ పవర్ విడుదల చేస్తుంది.

ధోనీ బైక్‌ల సేకరణలో హార్లే డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్, కవాసకి నింజా H2, కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్ కూడా ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు… యూటర్న్ తీసుకున్న కౌశిక్ తల్లి.. ఏం జరిగిందంటే?