మిస్టర్ కూల్, స్టార్ హీరో కలిసిన వేళ..!

క్రికెటర్ అండ్ యాక్టర్ ఇద్దరు కలిసి ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చారు.

ఈ ఇద్దరు కలవడం చూసి అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.వీరికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇంతకీ ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా.టీమ్ ఇండియా క్రికెట్ ఆటలో తనదైన ముద్ర వేసుకున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అలాగే మన తమిళ స్టార్ హీరో అయిన విజయ్‌ ఇద్దరు కలిసి అభిమానులకు షాక్ ఇచ్చారు.

ధోని సడన్ సర్ ప్రైజ్ ఇస్తూ విజయ్ కొత్తగా నటిస్తున్న సినిమా సెట్లోకి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.

అయితే ఇది యాదృచ్చికంగా గానే జరిగింది.అనుకుని కలిసిన, అనుకోకుండా కలిసిన ఎలాగయితేనేమి ఇద్దరు లెజెండ్స్ కలిశారు.

అది చాలు అంటున్నారు అభిమానులు.అసలు వివరాల్లోకి వెళితే.

ప్రస్తుతం మన దళపతి విజయ్‌ తాజాగా బీస్ట్‌ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్‌ పనిలో భాగంగా గత కొద్ది రోజులుగా విజయ్ చెన్నైలో గల గోకులం స్టూడియోలో షూటింగ్ పనుల్లో పాల్గొంటున్నారు.

అదే క్రమంలో ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్‌ లో భాగంగా ఎంఎస్ ధోని కూడా చెన్నైలో గల గోకులం స్టూడియోకి వచ్చాడు.

ఈ క్రమంలో విజయ్ కూడా అక్కడే వున్నాడని తెలుసుకుని విజయ్ ను కలవడానికి థోనీ సెట్‌ కి వెళ్లాడు.

"""/"/ అలా వీరిద్దరూ సెట్ లో కలిసారన్నమాట.వీరిద్దరిని చూసిన కెమేరామ్యాన్స్ వాళ్ళ కెమెరాలకు పని పెట్టి ఈ స్టార్స్ ను ఫోటోలు తీయడం మొదలుపెట్టారు.

ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.త్వరలో మొదలు అవ్వబోయే ఐపీఎల్‌ మ్యాచ్ కి సంబంధించిన యాడ్ షూటింగ్‌ గురించి ధోని గోకులం స్టూడియోకి వచ్చారంటూ ఆయన అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.

ఒకే ఫ్రేమ్ పై ఇలా ఇద్దరి కట్ఔట్స్ ను చూడడం నిజంగా ఆనందంగా ఉందని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

పొట్లాడుకుంటూ ఉద్యోగికి తగిలిన ఆవులు.. బస్సు టైర్ కింద పడటంతో స్పాట్ డెడ్..?