Mrunal Thakur : రేచీకటి సమస్యతో బాధ పడుతున్న మృణాల్ ఠాకూర్.. ఏం జరిగింతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

 బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ అనంతరం తెలుగులో సీతారామం ( Sitaramam )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ).

మొదటి సినిమాతోనే తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

ఇలా మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో కెరియర్ పరంగా తెలుగులో వచ్చిన అవకాశాలు అన్ని ఉపయోగించుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ఎంతో అద్భుతమైన కథ చిత్రాలకు మాత్రమే ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ప్రస్తుతం ఈమె తెలుగులో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న ( Hai Nanna ) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటిస్తున్నారు. """/" / ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు హిందీలో కూడా ఈమె వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన గురించి ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు.

ఈమె రేచీకటి సమస్యతో బాధపడుతున్నారట.ఇలా తాను రేచీకటి సమస్యతో బాధపడుతున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టి తనకు పెళ్లి చేయాలని భావిస్తున్నారు అంటూ ఈమె చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

"""/" / ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఈమెకు రేచీకటి సమస్య ఉండడం ఏంటి? ఆ విషయాన్ని దాచి పెళ్లి చేయడం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈమె తన రేచీకటి సమస్య గురించి చెబుతూ అసలు విషయాన్నీ బయట పెట్టారు తాను రే చీకటి సమస్యతో బాధపడుతున్నది నిజజీవితంలో కాదని బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను నటించబోయే ఆంఖ్‌ మిచోలీ అనే సినిమాలో నటిస్తున్నానని ఇందులో తాను రేచీకటి సమస్యతో బాధపడుతున్నట్లు నటించానని తెలిపారు.

ఇలా సమస్యను దాచిపెట్టి తమ కుటుంబ సభ్యులు తనకోసం ఒక వరుడిని ఎతికే పనిలో ఉన్నారని ఈమె తెలియజేశారు.

ఇలాంటి ఒక విభిన్నమైనటువంటి పాత్రలలో నటించడం ఒక చాలెంజ్ లాగా అనిపిస్తుంది అంటూ తన పాత్ర గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్యతో పరిచయం, ప్రేమ, పెళ్లి పై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!