మృణాల్ డెడికేషన్ కు ఫిదా అవుతున్న తెలుగు ఆడియెన్స్.. ఏం చేసిందంటే?
TeluguStop.com
మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క సినిమాతో సౌత్ లో బాగా పాపులర్ అయ్యింది.
నార్త్ హీరోయిన్ అయినప్పటికీ ఈమె ఇక్కడ ఒక్క సినిమా తోనే అందరిని తన వైపుకు తిప్పుకుంది.
సీతారామం ( Sita Ramam )అనే హిట్ తో ఈ భామ సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిపోయింది.
సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించిన ఈ అమ్మడి నటనకు అంతా ఫిదా అయ్యారు.
"""/" /
ఒక్క సినిమాతో ఇక్కడ ఫేమస్ అయిన ఈ బ్యూటీకి బాగానే అవకాశాలు వరిస్తున్నాయి.
ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ లలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పాగా వేయాలని చూస్తుంది.
అయితే ఈమెకు తెలుగులో మాత్రం వరుస అవకాశాలు వరిస్తున్నాయి.ఇక్కడ ప్రజెంట్ కుర్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
"""/" /
ఇదిలా ఉండగా ఈ భామ ప్రజెంట్ చేస్తున్న పనికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.
అంతగా ఏం చేసిందంటే.మృణాల్ తెలుగు నేర్చుకునే పనిలో ఉంది.
తెలుగు క్లాస్ లు వింటున్న ఈ భామ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆన్ లైన్ ద్వారా తెలుగు నేర్చుకుంటున్న ఈ భామను చూసిన వారంతా తెగ పొగిడేస్తున్నారుఈ రోజుల్లో తెలుగులో అవకాశాలు వస్తున్నా మన బాష నేర్చుకోవాలని స్టార్ హీరోయిన్లే అనుకోవడం లేదు.
దశాబ్దాలుగా ఉన్న స్టార్ హీరోయిన్ లకు కూడా తెలుగు రాదు.మరి ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ తెలుగుపై చూపిస్తున్న ఆసక్తికి తెలుగు ఆడియెన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ అమ్మడి డెడికేషన్ ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!