ఆ స్టార్ హీరోను కొట్టాలంటే చాలా భయమేసింది.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈమె విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ ( Family Star ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఇక ఈమె టాలీవుడ్ సినిమాలలో నటించడానికి కంటే ముందుగా బాలీవుడ్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించినటువంటి చిత్రం జెర్సీ ( Jersey ) ఈ సినిమాని హిందీలో వరుణ్ ధావన్ ( Varun Dhawan ) మృణాల్ ఠాగూర్ నటించారు.

"""/" / ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటి మృణాల్ ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

తాను వరుణ్ ధావన్ కి పెద్ద అభిమానిని అయితే ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పానని తెలిపారు.

ఇక ఈ సినిమా మొదటిరోజు షూటింగ్ సమయంలో తాను చాలా భయపడ్డానని తెలిపారు.

అయితే హీరో నవ్వుతూ ఉండడంతో తనని చూస్తూ అలా ఉండిపోయానని తెలిపారు.ఆయన తెరపై ఎలా నవ్వుతూ ఉంటారో తెర వెనుక కూడా అలాగే నవ్వుతూ కనిపించారని వెల్లడించారు.

"""/" / ఇకపోతే ఈ సినిమా మొదట్లో నటించడానికి కాస్త భయం వేసిన ఒక వారం రోజుల తర్వాత చాలా ఫ్రీగా వరుణ్ దావన్ తో కలిసి నటించగలిగానని తెలిపారు.

అయితే ఇందులో ఓ సన్నివేశంలో హీరోని కొట్టాల్సి ఉంటుంది.ఆ సన్నివేశం చేయడానికి తను చాలా భయపడ్డాను.

నేను చిన్నగా కొడతాను మీరు ఎడిటింగ్ లో చేసుకోండని చెప్పాను కానీ డైరెక్టర్ అసలు ఒప్పుకోలేదు.

ఇక వరుణ్ ధావన్ సైతం ఈ సన్నివేశం తీసే సమయంలో తనకు బాగా సపోర్ట్ చేశారు మీరు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని గుర్తు చేసుకొని నన్ను కొట్టండి అంటూ తనకు సలహాలు ఇచ్చారు.

దాదాపు ఈ సీన్ మూడు గంటల పాటు చేశామని ఈ సందర్భంగా గత విశేషాలను మృణాల్ ఠాకూర్ గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

/p.

అక్కినేని ఇంటికి చిన్న కోడలుగా రాబోతున్న జైనాబ్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?