పిల్లల కోసం పెళ్లి కాకుండానే ఆ పనికి సిద్ధమైన సీతరామం బ్యూటీ…షాక్ లో ఫ్యాన్స్?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఒకరు.

ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో నటించేవారు అనంతరం బాలీవుడ్ మరాఠీ సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం ( Sitaramam ) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా తెలుగులో నటించిన మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు.

ఇలా తెలుగు ప్రేక్షకుల మధ్యలో సీతా మహాలక్ష్మిగా గుర్తుండిపోయారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

అయితే కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఈమె బిజీగా ఉన్నారు.ఇటీవల హాయ్ నాన్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

"""/" / ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె రిలేషన్షిప్ ( Relation Ship ) గురించి అలాగే పిల్లల( Kids ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రిలేషన్ షిప్ లో ఉండడం అంటే చాలా కష్టతరమైన పని అని మనల్ని అర్థం చేసుకొని జీవిత భాగస్వామి దొరకడం చాలా కష్టమని తెలిపారు.

ఇక పిల్లల గురించి కూడా ఈమె పలు విషయాలు తెలియచేశారు .తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ ( Egg Freezing ) చేయాలని అనుకుంటున్నాను తెలియజేశారు.

"""/" / అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలా ఎగ్ ఫ్రీజింగ్ అంటే సాధారణమైన విషయం అని చెప్పాలి కానీ మనకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు అందరూ కూడా కెరియర్ పై ఫోకస్ చేసి సరైన సమయానికి పెళ్లి చేసుకోరు అయితే వీరికి పెళ్లి అయిన తర్వాత ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుట్టాలి అంటే యుక్తవయసులో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేస్తారు.

అయితే వీరికి పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆ ఎగ్ ద్వారా పిల్లలను కంటారు.అయితే ఈ విషయం సాధారణ వ్యక్తులకు కాస్త ఆశ్చర్యంగా కలిగించిన ఇండస్ట్రీలో ఇది కామన్ అయిపోయింది .

ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ సైతం భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యం కోసం పెళ్లి కాకుండానే తన ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నారని విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఐఫోన్ వాడుతున్నారా.. మీరు మోసపోతున్నట్లే.. షాకింగ్ నిజం బయటపెట్టిన మహిళ!