సినిమా చూసి ప్రేమలో పడకపోతే నా పేరు మార్చుకుంటా: మృణాల్
TeluguStop.com
నాని ( Nani ) హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హాయ్ నాన్న( Hai Naana ).
నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి చిత్ర బృందం వచ్చారు. """/" /
ఇకపోతే ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ వేడుకలో ఈమె చాలా అందంగా క్యూట్ గా అందరిని ఆకర్షించారు.
అయితే ఈ ఈవెంట్లో మృణాల్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సీతారామం సినిమా ద్వారా ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించారని ఈమె తెలియజేశారు.ఈ సినిమా కూడా ఎంతో అద్భుతంగా ఉందని డైరెక్టర్ ఈ సినిమా కథ చెప్పేటప్పుడు తాను చాలా ఇంప్రెస్ అయ్యానుని తెలిపారు.
"""/" /
ఈ సినిమాలో నానితో కలిసిన నటించే అవకాశం అని చెప్పగానే తనకు చాలా సంతోషం వేసిందని ఈమె వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంత చక్కగా చూపించారని నాని, బేబీ కియరా ( Baby Kiyara )మధ్య వచ్చే సన్నివేశాలు చూసి ప్రతి ఒక్కరు కూడా వారి ప్రేమలో పడతారని అలా వారి ప్రేమలో పడకపోతే నేను తన పేరే మార్చుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఈమె ఇంత ధీమాగా చెబుతున్నారు అంటే తప్పకుండా ఆ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని స్పష్టంగా అర్థమవుతుంది.
దసరా సినిమా తర్వాత నాని నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.
సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగు పూయొద్దు: పవన్ కళ్యాణ్