ఇంట్రెస్టింగ్ స్టెప్.. వినూత్నంగా ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) నటిస్తున్న సరికొత్త మూవీ ''హాయ్ నాన్న( Hi Nana )''.

ఎప్పుడు డిఫరెంట్ సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

దసరా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్న నాని అలానే కంటెంట్ ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ ఇది వరకు కంటే బెటర్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

నాని ప్రస్తుతం తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా హాయ్ నాన్న చేస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అంచనాలు హై లెవల్లో పెరిగి పోయాయి.

"""/" / ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ కూడా వచ్చింది.ఇది ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా సెకండ్ సింగిల్ ను ఈ రోజు రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం అయ్యారు.

ఇప్పటికే నిన్న ప్రోమో రిలీజ్ చేయగా ఇది తండ్రి, కూతురు ఎమోషన్ తో కూడిన సాంగ్ అని తెలుస్తుంది.

మరి ఈ సాంగ్ ను రిలీజ్ చేసే విషయంలో మేకర్స్ ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తున్నారు.

"""/" / ఇది తండ్రి, కూతురు మధ్య సాగే బాండింగ్ కు సంబంధించిన సాంగ్ కాబట్టి తెలుగులో మహేష్ ఆయన కూతురు సితార, తమిళ్ లో శివకార్తికేయన్ ఆయన కూతురు, కన్నడలో కిచ్చా సుదీప్( Sudeep ) ఆయన కూతురుతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ స్నాప్స్ తో ఈ సాంగ్ ను అనౌన్స్ చేసారు.

దీంతో మేకర్స్ ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకుని ఈ సాంగ్ ను ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీ రోల్ పోషిస్తున్నారు.వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే డిసెంబర్ 21న ఈ సినిమాను పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

దసరా హిట్ ను నాని హాయ్ నాన్న సినిమాతో కొనసాగిస్తాడో లేదో చూడాలి.

ఒక్క స్పూన్ ధ‌నియాల‌తో ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?