Hi Nanna : హాయ్ నాన్న సినిమాలో వాళ్లిద్దరూ న్యాచురల్ స్టార్ నానిని డామినేట్ చేశారా.. ఏమైందంటే?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ( Nani )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు నాని.

ఇకపోతే నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న.( Hi Nanna )ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం నాని ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా హాయ్ నాన్న సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

"""/" / అదేమిటంటే హాయ్ నాన్న సినిమాలో నాని నటనను హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ ( Mrunal Thakur )అలాగే బేబీకి కియారా డామినేట్ చేశారట.

మామూలుగా సినిమాలలో హీరో నాని నటన ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

నాని పక్కన ఎవరున్నా కూడా నటనలో తేలిపోతూ ఉంటారు.అలాంటిది హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్‌, కియారా ఇద్దరూ నాని నటనను నామినేట్ చేశారట.

సీతారామం సినిమాలో మాదిరిగానే ఇందులో కూడా గుర్తుండిపోయే పాత్ర పోషించింద‌ట మృణాల్.కాగా ఈ సినిమాలోని ఒక సన్నివేషంలో మృణాల్ నానిని డామినేట్ చేసేసింద‌ట‌.

ఆ సీన్ ఈ సినిమాలో చాలా స‌ర్‌ప్రైజింగ్ గా అనిపిస్తుంద‌ని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

"""/" / అంతేకాకుండా ఈ సినిమాలో నాని కూతురుగా బేబీ కియారా( Baby Kiara ) క‌నిపించ‌నుందట.

త‌న న‌ట‌న కూడా అంద‌రికీ షాక్ ఇస్తుంద‌ని చిత్ర‌బృందం ధీమాగా చెబుతోంది.కియారా చాలా తెలివైన పిల్ల‌.

సీన్ మూడ్ ని చాలా ఈజీగా అర్థం చేసుకొనేది.త‌న‌కు మేం పెద్ద‌గా ఫీడ్ చేయాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు.

ఇటీవ‌ల కాలంలో సిల్వ‌ర్ స్క్రీన్ చూసిన ఒక గొప్ప బాల న‌టి త‌ను అని ద‌ర్శ‌కుడు కితాబు కూడా ఇచ్చేశాడు.

ఒక సీన్‌లో నాని, మృణాల్‌, కియారా ముగ్గురూ పోటీ ప‌డి న‌టించార‌ని, ఆ సీన్‌ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుంద‌ని, ఈ సినిమాతో మృణాల్ పేరు మ‌రింత గ‌ట్టిగా వినిపించ‌డం ఖాయ‌మ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల న‌మ్మ‌కం.

మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.