'మిస్టర్‌ మజ్ను' బడ్జెట్‌ ఎంత? వస్తున్న కలెక్షన్స్‌ ఎంత? వారికి రక్తకన్నీరే!

అక్కినేని అఖిల్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'మిస్టర్‌ మజ్ను' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంతో అఖిల్‌ ఖచ్చితంగా హిట్‌ కొడతాడని అంతా భావించారు.

సక్సెస్‌ నిర్మాతగా పేరు దక్కించుకున్న బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం లేదు.

తొలి ప్రేమ చిత్రంతో సక్సెస్‌ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంతో బొక్క బోర్లా పడ్డాడు.

ఏమాత్రం ఆకట్టుకోకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అఖిల్‌ మొదటి రెండు సినిమాలు ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని కాస్త తక్కువ బడ్జెట్‌తో అంటే 20 కోట్లకు కాస్త అటు ఇటు బడ్జెట్‌తో నిర్మించారు.

సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని అన్ని ఏరియాలకు కలిపి 22.

5 కోట్లకు కొనుగోలు చేశారు.నిర్మాతకు విడుదలకు ముందే రెండున్న కోట్ల రూపాయలు లాభం దక్కింది.

అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం కలెక్షన్స్‌ దారుణంగా వస్తున్నాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ విడుదలైన మొదటి రోజు 4.

3 కోట్ల రూపాయల షేర్‌ దక్కింది.ఆ తర్వాత రోజు నుండే కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టాయి.

వీకెండ్‌లో ఈ చిత్రం మరో అయిదు కోట్లను రాబట్టింది.మొత్తంగా పది కోట్ల షేర్‌ను ఈ చిత్రం అటు ఇటుగా రాబట్టిందని, మరో రెండు మూడు కోట్లకు ఎక్కువగా ఈ చిత్రం దక్కించుకోవడం కష్టమే అంటున్నారు.

ఎంత ప్రయత్నించినా కూడా ఈ చిత్రం 15 కోట్లకు మించి షేర్‌ దక్కించుకోలేక పోవచ్చు అనేది ట్రేడ్‌ వర్గాల విశ్లేషణ.

డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం వల్ల దాదాపుగా 10 కోట్లు లాస్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ అయితే స్టార్‌ హీరోల సరసన చేరాలని భావించిన అఖిల్‌కు ఈచిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.