తిమ్మాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన: ఎంపీపీ పిల్లి రేణుక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం రెండో విడతలో భాగంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ ప్రారంభించారు.

కంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరు వచ్చి ప్రభుత్వం ఇస్తున్న కంటి వెలుగు అద్దాలను పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సర్పంచ్ పడగల రవీందర్, ఎంపీటీసీ వరదబాబు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు అనిల్, వార్డు సభ్యులు, శేఖర్, పల్లె శ్రీనివాస్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సీత్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

1000 కోట్లు సాధిస్తేనే సినిమా హిట్.. సౌత్ సినిమాలు ప్రూవ్ చేస్తున్న లెక్క ఇదేనా?