సీఎం కప్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించిన ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:క్రీడలు శారీరక,మానసిక దృఢత్వానికి తోడ్పడతాయని నేరేడుచర్ల ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి అన్నారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలలో యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో రిజిస్టర్ చేసుకుని పాల్గొనడం ఆనందదాయకమన్నారు.

జిల్లా స్థాయికి ఎంపికైన వారు ఈనెల 16 నుండి 21 వరకు సూర్యాపేటలో నిర్వహించే జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని,రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వాలని, మన ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అలక సరిత,కమిషనర్ అశోక్ రెడ్డి,ఎంఈఓ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు బట్టు మధు,పీడీలు ఎం.

యాదగిరి,విజయ్, అశోక్,తరుణ్,అరుణ తదితరులు పాల్గొన్నారు.

అల్లు అర్జున్ కోసం పని చేసిన లాయర్ ఫీజు ఎంతో తెలుసా.. వామ్మో ఇంత తీసుకుంటారా?