కాంగ్రెస్ పార్టీ హిందూ విరోధి: సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ
TeluguStop.com
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Election ) రోజుల వ్యవధిలోకి మారినందున అధికార ప్రతిపక్ష నేతలు విమర్శలతో హోరెత్తిస్తున్నారు.
అలవి గాని హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు .తాము అధికారంలోకి వస్తే బజరంగ్దళ్లను దేశంలో నిషేధిస్తాం అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు.
తమ దేవుళ్ళతో పెట్టుకోవద్దు అంటూ మాస్ మార్నింగ్ ఇస్తున్నారు.తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు బిజెపి యువమోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తేజస్వి సూర్య( Tejaswi ).
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు కాంగ్రెస్ అదికారం లోకి వస్తే గుండారాజ్యం పెరిగిపోతుందని నేరస్తులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
"""/" / తమది దేశం కోసం పాటుపడే పార్టీ అని దేశంలో అల్లర్లను రెచ్చగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అని అందరికీ తెలుసు అని ఆయన తెలిపారు .
బజరంగదళ్ ని నిషేదిస్తామని ప్రకటించడం ద్వారా తమది హిందూ వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ స్పష్టం చేసినట్లు అయిందని ఆయన తెలిపారు రాష్ట్రంలో భాజాపా అధికారంలోకి రాగానే గోవధ ని నిషేధిస్తామని మతమార్పిడులను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు .
మెజారిటీ ప్రజల హక్కులను కాపాడే పార్టీ భాజపా మాత్రమేనని, దేశంలో సాంత్రి భద్రతలు స్థిరంగా ఉండాలంటే భాజపాకు అధికారం ఇవ్వాలంటూ ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు .
"""/" / చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని,మోరల్ పోలీసింగ్ ను తాను సమర్థించనని అయితే మూర్ఖత్వంగా భజరంగ్ద దళ్ నిషేధించడం లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు .
లోకాయుక్తను నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పుడు దానిని బలోపేస్తామని చేస్తామని ఆ పార్టీ అభ్యర్థి సిద్ధ రామయ్య చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తేజస్వి సూర్య చెప్పారు ఏది ఏమైనా ప్రచారానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉన్నందున ఆరోపణలు ప్రతి ఆరోపణలతో కర్ణాటక రాజకీయం వేడి పీక్ స్టేజ్ కి చేరినట్లుగా తెలుస్తుంది.
మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ సంవత్సరంలో అయిన మోక్షం లభిస్తుందా..?