ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల వ్యవహారం..!!
TeluguStop.com
ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు( Lavu Sri Krishna Devarayalu ) సమావేశం అయ్యారు.
రెండు రోజుల క్రితం చంద్రబాబును ఆయన కలిశారని తెలుస్తోంది.సుమారు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగగా గుంటూరు జిల్లా రాజకీయాలపై వీరు చర్చించారని సమాచారం.
దీంతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ గూటికి చేరతారనే వార్త చక్కర్లు కొడుతుంది. """/" /
మరోవైపు చంద్రబాబు, శ్రీకృష్ణదేవరాయల( Chandra Babu Naidu ) భేటీ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైందని తెలుస్తోంది.
గుంటూరు, నరసరావుపేట ఎంపీ సీట్లపై టీడీపీకి( TDP 0 చెందిన పలువురు ఎన్నారైలు ఆశలు పెట్టుకున్నారు.
ఈ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో చేరితే అందులో ఒకస్థానం ఆయనకు వెళ్తుందేమోనని టెన్షన్ పడుతున్నారని సమాచారం.
కాగా నరసరావుపేట ఎంపీ సీటుపై శ్రీకృష్ణదేవరాయలు ఆసక్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
ఆ విషయం నాకు మాత్రమే తెలుసు… శోభిత పెళ్లి ఫోటోలపై సమంత కామెంట్స్!