ఏ 1 ఏ2 అంటూ రఘురామ సంచలన విమర్శలు

తమపై నిత్యం అనేక విమర్శలు చేస్తూ, లేఖలతో విసుగు తెప్పిస్తున్న రఘురామకృష్ణంరాజు పై వేటు వేయించేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలోనే రఘురామను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినందుకు, ఆయనకు సంబంధించిన కంపెనీలు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించి అవినీతి వ్యవహారాలపై రాష్ట్రపతి, ప్రధానికి వైసిపి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై రఘురామకృష్ణంరాజు ఘాటుగానే స్పందించారు." నేను బ్యాంకు రుణాలు ఎగవేశాను అని, చర్యలు తీసుకోవాలని ఏ 1, ఏ 2 లు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు లేఖ రాయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది " అంటూ రఘురాము ఘాటుగా విమర్శలు చేశారు.

తన కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించి రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'' సుమారు 17 కేసులలో ఉండి ఏ 1, ఏ 2 గా పేరు పొందిన వారి గురించి చర్చించుకుందాం.

ఇలాంటి నేర చరిత్ర కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి మీద చార్జిషీట్లు కూడా నమోదయ్యాయి.

నా కంపెనీ బ్యాంకుకు సొమ్ములు ఎగ్గొట్టాయని, త్వరగా చర్యలు తీసుకోవాలని ఈ ఇద్దరు నిందితులు ప్రధాని ,రాష్ట్రపతికి లేఖ రాశారు.

43 వేల కోట్లు దోచారు అనే అభియోగాలతో చార్జిషీట్లలో ఉన్న నిందితులు ఇలా లేఖలు రాయడం దెయ్యాలు వేదాలు వల్లించడమే" అంటూ రఘురామ్ ఫైర్ అయ్యారు.

"""/"/ ఏ నిందితుడు అయితే ముఖ్యమంత్రి గా మారి పనికిమాలిన కేసులు పెట్టి వేధిస్తూ, ఇంతమంది చావుకు కారణమయ్యాడో  ఆయన తన గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని రఘు రామ విమర్శించారు.

జగన్ కేసులకు సంబంధించి అప్పటి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసింది చాలా తక్కువేనని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, అవి కోర్టుకు అప్పగించాలని చెప్పారు.

జగన్ అవినీతి వ్యవహారాలకు సంబంధించి ప్రధాని రాష్ట్రపతి కి చెబితే న్యాయం జరుగుతుందని తన సహచరులు చెబుతున్నారని, కాబట్టి నేరుగా వారికే వీటిపై ఫిర్యాదు చేస్తానన్నారు.

ఇక వైసిపి ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తోంది తనపై అనర్హత వేటు వేయించేందుకే తప్ప, ఏపీ ప్రయోజనాల కోసం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 .

సీఎం జగన్ రేపటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!