చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పై ఎంపీ రఘురామకృష్ణరాజు సీరియస్ కామెంట్స్..!!

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు( Chandrababu Birthday ) కావటంతో ఏపీలో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు చేశారు.

ఎలక్షన్ సమయం కావటంతో.రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో తెలుగుదేశం నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ రకంగానే శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎంపీ రఘురామకృష్ణరాజు( MP Raghuramakrishna Raju ) చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు.

వేడుకలలో భాగంగా కేక్ కట్ చేయడం జరిగింది.అనంతరం సైకిల్ తొక్కుతూ కార్యకర్తలలో జోష్ నింపారు.

మరో 10 సంవత్సరాలు జగన్( CM Jagan ) ముఖ్యమంత్రిగా కొనసాగితే.ఇప్పుడు బాల్యంలో ఉన్న పిల్లలకు భవిష్యత్తు ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు అన్నిచోట్ల ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. """/" / తాను కేసుల పుట్ట అయితే.

సీఎం జగన్ కేసుల గుట్ట అంటూ ఎద్దేవా చేశారు.కాబట్టి బిడ్డల తల్లిదండ్రులు జరగబోయే ఎన్నికలలో చంద్రబాబుకి ఓటు వేసి బిడ్డల భవిష్యత్తును కాపాడాలని రఘురామకృష్ణరాజు స్పష్టం చేయడం జరిగింది.

ఏపీలో ఎన్నికలకు ఇంక మూడు వారాలు మాత్రమే సమయం ఉంది.ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.

నిన్న ఉండి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

ఏదో రకంగా వైసీపీని ఓడించాలని రఘురామకృష్ణరాజు మంచి పట్టుదల మీద ఉన్నారు.మూడు పార్టీల కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలో నరసాపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని మొదట భావించిన పరిస్థితులు అనుకూలించలేదు.

దీంతో ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా.రఘురామకృష్ణరాజు బరిలోకి దిగటం జరిగింది.

తమాషా చేస్తున్నారా ..కోర్టుకు వెళ్తాను పుష్ప 2 వాయిదా పై నెటిజన్ ఫైర్!