వారికి మెంటల్ ఎక్కింది ? వీరావేశంతో రాజు గారు ?

వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా ఆ పార్టీపై అసమ్మతి వ్యక్తం చేస్తూనే, బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే తీవ్రస్థాయిలో సొంత పార్టీపై సంచలన విమర్శలు చేస్తూ, చాలా కాలంగా ఆయన హడావుడి చేస్తూనే వస్తున్నారు.

అయినా వైసిపి అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదు.మొదట్లోనే ఆయనను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేస్తుంది అని, ఆయన బిజెపిలో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగినా, వైసిపి అధిష్టానం రఘురామ కృష్ణంరాజు పై ఎటువంటి చర్య తీసుకోలేదు.

అలా అని బిజెపి సైతం ఆయనను చేర్చుకునేందుకు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు.

ఇక నిత్యం ఏదో ఒక అంశంపై  వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న రఘురామకృష్ణంరాజు చాలాకాలంగా సైలెంట్ అయిపోవడం పై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఇదే అదునుగా వైసిపి సోషల్ మీడియా విభాగం ఆయన ఆరోగ్య పరిస్థితి పై సెటైర్లు వేయడంపై రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ , తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని ఉద్దేశించి వెధవల్లా తయారయ్యారు అంటూ మండిపడ్డారు.వారి ప్రవర్తన చూస్తుంటే వారిలో మానసిక రుగ్మత బాగా పెరిగిపోయి నట్లుగా కనిపిస్తోందని, తనకు తీవ్ర అనారోగ్యం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, వికృత ఆనందం పొందాలని చూస్తున్నారు అంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

తాను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నానని, తనకు ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిందని, అది విజయవంతం అయిందని, తనపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ల గురించి రాష్ట్రంలో పోరాటం కొనసాగిస్తానని రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

"""/"/ తన గురించి, తన ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

మరోసారి వైసీపీ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించేందుకు రఘురామకృష్ణంరాజు సిద్దం అయినట్టుగా రఘురామకృష్ణంరాజు కనిపిస్తున్నారు.

కాకపోతే గతంలో బిజెపికి దగ్గర అయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సైలెంట్ అయిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్28, ఆదివారం2024