ఏపీ అప్పుల్లోకి ప్రధానిని లాగిన రఘురామ ? 

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు పైన ఆరా తీస్తూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

వైసీపీ నుంచి గెలిచిన రఘురామ ఆ పార్టీతో విభేదాలు తలెత్తిన తరువాత ప్రతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వాన్ని,  జగన్ ను ఇరికిస్తూ తన రాజకీయ కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు విషయమై రఘురామకృష్ణంరాజు ప్రస్తావించారు.

  ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని,  ఇప్పటికే 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని , మరో లక్ష కోట్లు అప్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని , వెంటనే ప్రధాని ఏపీ వ్యవహారాలపై జోక్యం చేసుకోవాలంటూ పార్లమెంట్ లో ప్రస్తావించారు.

అంతేకాదు కేంద్ర  ప్రభుత్వం రాష్ట్రాలు అప్పులు తీసుకునే ఎఫ్ ఆర్ బీఏం పరిమితి కూడా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ ఉందంటూ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ లో ప్రస్తావించారు.

ఈ వ్యవహారాల కారణంగా ఆర్టికల్ 293 ఉల్లంఘన జరుగుతోంది అంటూ రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు.

వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి ఏపీ ఆర్థిక పరిస్థితి పై దృష్టి సారించకపోతే పూర్తిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ  అందులో ప్రస్తావించారు.

ఏపీ ప్రభుత్వం ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని , ఎవరూ ఈ తరహా ఉల్లంఘన లకు పాల్పడకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ లో ప్రస్తావించారు.

"""/" / రఘురామ కృష్ణంరాజు ఈ అంశంపై పార్లమెంటులో ప్రస్తావించిన సమయంలో వైసీపీ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా రఘురామ మాత్రం ఈ అంశం ను హైలెట్ చేసి ఏపీ పరిస్థితి పై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరడం ద్వారా ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా దెబ్బతిందనే విషయాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇప్పటికి ఏపీ ఆర్థిక పరిస్థితి పై కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి.  సొంతంగా కేంద్రం సైతం నివేదికలు తెప్పించుకుంటూనే ఉంది.

  ఇదే సమయంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ అంశంపైన విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హనుమాన్ కి మరణం లేదు కదా? మరి హనుమాన్ జయంతి అని అనకూడదా..!