MP Mithun Reddy : కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ కానున్న ఎంపీ మిథున్ రెడ్డి..!!

కాకినాడ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ) నివాసానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు.

ఈ మేరకు కిర్లంపూడిలోని( Kirlampudi ) ముద్రగడ నివాసంలో వీరు భేటీ కానున్నారు.

ఇప్పటికే ముద్రగడ ఇంటికి వైసీపీ జిల్లా కాపు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరుకోగా.ఆయన అనుచరులు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముద్రగడను వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించనున్నారు.అయితే ప్రస్తుతానికి ఎటువంటి షరతులు లేకుండానే ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.