నారా లోకేశ్ సవాల్ ను స్వీకరించిన ఎంపీ మిథున్ రెడ్డి..!
TeluguStop.com
టీడీపీ నేత నారా లోకేశ్ విసిరిన సవాల్ ను ఎంపీ మిథున్ రెడ్డి స్వీకరించారు.
ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లెకు వచ్చానని ఎంపీ తెలిపారు.రాజకీయ లబ్ధి కోసమే లోకేశ్ సవాల్ విసిరాడని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.
లోకేశ్ చర్చకు రాకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను అడ్డుపెట్టుకుని పారిపోయాడని మండిపడ్డారు.
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నానన్న ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ సమయం, స్థలం చెప్తే స్పీకర్ అనుమతి తీసుకొని వస్తానని తెలిపారు.
తాము చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.