నేను ఆరోగ్యంగానే ఉన్నా… అస్వస్థత వార్త అవాస్తవం: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారని అర్టీవీ ఛానల్ లో వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు.

హైదరాబాద్ లోని తన నివాసం నుండి ఆయన మాట్లాడుతూ నా ఆరోగ్యంపై ఆర్టీవీ ఛానల్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని,నేను అస్వస్థతకు గురయ్యానని వస్తున్న వార్తలు అవాస్తవమని,హైదరాబాద్ లోని నివాసంలోనే ఉన్నానని,నాకు ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ రాలేదని,తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఊరుకోనని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ ఛానల్ పై విరుచుకుపడ్డారు.

నేను ఆరోగ్యంగానే ఉన్నా కాసేపటి క్రితమే నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన చెల్లబోయిన ఉపేందర్ కుటుంబాన్ని కలిశానని, ఇతను కొద్ది రోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో చనిపోయాడని,ఉపేందర్ భార్య,పిల్లలను హైదరాబాద్ లోని నా నివాసంలో ఇవాళ కలిసి,వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశానని అన్నారు.

తప్పుడు వార్తలను చూసి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనపడవద్దని,నాకు అస్వస్థత అంటూ ఆర్టీవీలో వస్తున్న ఫేక్ న్యూస్ ని నమ్మవద్దని చెప్పారు.

ఇలాంటి కొన్ని ఛానల్స్ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా వార్తలు ఇస్తున్నాయని,ఇప్పటికే బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసి,తగిన చర్యలు తీసుకోవాలని కోరామని,తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు సంబంధిత ఆర్టీవీకి చెందినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

రేటింగ్స్ కోసం ఫేక్ న్యూస్ లు ఇస్తూ జనాన్ని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.

మీ హెయిర్ రూట్స్ చాలా వీక్ గా ఉన్నాయా.. వర్రీ వద్దు ఇలా చేయండి!