కేసీ వేణుగోపాల్ తో ఎంపీ కోమటిరెడ్డి చర్చలు..!
TeluguStop.com
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్( K C Venugopal ) తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.
తాజ్ కృష్ణ నుంచి తన కారులోనే ఆయనను విమానాశ్రయానికి తీసుకెళ్లిన కోమటిరెడ్డి ఎయిర్ పోర్టులో( Komatireddy Venkat Reddy ) దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు.
సీడబ్ల్యూసీ, స్క్రీనింగ్ కమిటీ( Screening Committee )లో తనకు చోటు కల్పించకపోవడంపై కోమటిరెడ్డి అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్ తో ఇదే విషయంపై కోమటిరెడ్డి చర్చించారని తెలుస్తోంది.
కాగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.