వైరల్ వీడియో: పార్లమెంట్‌కు సైకిల్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు..

గత నెలలో జరిగిన భారతదేశ పార్లమెంటు ఎన్నికల్లో( Parliament Elections ) భాగంగా ఎన్డీయే కూటమి మరోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ప్రధానిగా నరేంద్ర మోడీ( PM Narendra Modi ) మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ఎన్నికల ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎన్డీయే కూటమికి సపోర్టుగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసింది.

ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పార్లమెంట్ సభ్యులు.

"""/" / ఇందులో భాగంగానే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు( MP Ram Mohan Naidu ) కేంద్రమంత్రి అవ్వగా.

నేడు ఆయన పార్లమెంట్ సభలో తెలుగులో ప్రమాణం స్వీకారం చేశారు.శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించిన ఆయన తొలిసారి కేంద్రమంత్రి అయ్యాడు.

ఇదివరకు కూడా రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. """/" / ఇక అలాగే ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎంపీ విజయనగరం నుంచి కిలిశెట్టి అప్పలనాయుడు( MP Kalisetti Appala Naidu ) భారీ విజయంతో పార్లమెంటులో మొదటిసారి అడుగుపెట్టనున్నారు.

దీంతో ఆయన మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టే సమయంలో కాస్త వినూత్నంగా ఆలోచించి పార్లమెంటుకు సైకిల్ పై( Cycle ) వెళ్లారు.

ఆయన వినూత్నంగా ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి పార్లమెంట్ కు సైకిల్ పై ప్రయాణం చేసారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

టీడీపీ పార్టీ తరపున కిలిశెట్టి అప్పలనాయుడు తన సమీప వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ పై ఏకంగా రెండున్నర లక్షల భారీ మెజారితో అఖండ విజయాన్ని నమోదు చేసాడు.

ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..