పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం అంటున్న ఎంపీ భరత్..!!
TeluguStop.com

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలో ప్రధాని మోడీ( PM Modi ) ఎన్డిఏ కూటమి నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది.


ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం కోసం.నిధులు విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని అన్నారు.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.దీంతో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ భరత్( YCP MP Bharath ) స్పందించారు.
"""/" /
పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వం నిర్మించటం లేదని ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.
పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే అదనంగా తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని స్పష్టం చేశారు.
సరైన సమయంలో నిధులు ఇస్తే పోలవరం పూర్తి చేసేవాళ్లం.పదేళ్లలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో బీజేపీ ( BJP ) వాళ్లు చెప్పాలి అని డిమాండ్ చేశారు.
గతంలో ప్రధాని మోడీ పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.
మళ్లీ ఇప్పుడు చంద్రబాబుని పొగుడుతున్నారు.ప్రజలు కాస్త ఆలోచించాలని ఎంపీ భరత్ సూచించారు.
తండ్రి మరణించిన తర్వాత వైసీపీ పార్టీని స్థాపించి సొంతంగా వైఎస్ జగన్ ఎదిగారని అన్నారు.
ఎన్నో పోరాటాలు చేసి ప్రజా మద్దతుతో ముఖ్యమంత్రి స్థానం అధిరోహించారని స్పష్టం చేశారు.
కల్లు బాటిల్ ఎత్తిన ఫారినర్.. ఒక్క గుటకతోనే ముఖం ఎలా పెట్టాడో చూడండి.. నవ్వు ఆపుకోలేరు..