జనసేనలో చేరిన తర్వాత సీఎం జగన్ పై ఎంపీ బాలశౌరి సంచలన వ్యాఖ్యలు..!!

ఈ ఆదివారం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి బాలశౌరి( Balashowry )ని ఆహ్వానించడం జరిగింది.

జనసేనలో జాయిన్ అయినా అనంతరం బాలశౌరి మాట్లాడుతూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారు.

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ సిద్ధం( Siddham ) అంటూ నిర్వహిస్తున్న మహాసభలపై విమర్శలు చేయడం జరిగింది.

సిద్ధం అంటూ మీటింగులు పెడుతున్న వైసీపీ దేనికి సిద్ధమని, పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు.

"""/" / రాబోయే రోజులలో జనసైనికులు వేటాడటానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.దేవుడున్నాడు అంటూ పదేపదే ఉపన్యాసాలు చేసే జగన్( YS Jagan Mohan Reddy )కే కాదు అందరికీ దేవుళ్ళు ఉన్నారని.

పేర్కొన్నారు.అమరావతి కట్టాలని వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పలేదా అంటూ నిలదీశారు.

జగన్ హయాంలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో  అభివృద్ధి జరగలేదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదని.జగన్ అబద్ధం చెబుతున్నాడని విమర్శించారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE