వివేకా కేసులో ముగిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది.

హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను సుమారు ఏడు గంటల పాటు అధికారులు విచారించారు.

విచారణలో భాగంగా వాట్సాప్ కాల్స్ తో పాటు రూ.4 కోట్ల ఫండింగ్ పై అధికారులు ప్రశ్నించారు.

కేసులో అఫ్రూవర్ గా మారిన దస్తగిరిని ప్రలోభాలకు గురి చేయడంపై సీబీఐ ఆరా తీసింది.

ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 30, ఆదివారం 2024