హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి ఎంపీ అవినాశ్ రెడ్డి..!!
TeluguStop.com
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరికాసేపటిలో హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి చేరుకోనున్నారు.
ఈ మేరకు జూబ్లీహిల్స్ నుంచి ఆయన సీబీఐ ఆఫీస్ కు బయలు దేరారు.
అవినాశ్ రెడ్డి వెంట పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో బయలుదేరారు.మరోవైపు చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
వైద్య పరీక్షల అనంతరం సీబీఐ కార్యాలయానికి తరలించనున్నారు.కాగా అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం ఇది ఐదో సారి.
ఐఓ వికాశ్ సింగ్ ఆధ్వర్యంలో అవినాశ్ రెడ్డిని విచారించడం మొదటిసారి అని తెలుస్తోంది.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?