సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి గైర్హాజరు..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు గైర్హాజరు అయ్యారు.ఆయన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు.

తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడ్మిట్ చేశారని ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐ అధికారులకు మెసేజ్ చేశారు.అయితే అవినాశ్ రెడ్డి సమాచారంపై ఇంతవరకు సీబీఐ అధికారులు స్పందించలేదని సమాచారం.

అయితే ఇవాళ సీబీఐ విచారణకు హాజరు అవుతానంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరవుతానని చెప్పిన విషయం తెలిసిందే.

మరో 2 సంవత్సరాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి..?