ఏళ్లకు ఏళ్ళు థియేటర్స్ లో నడిచిన సినిమాలు ఇవే !

ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా వారం రోజులు థియేటర్లో ఉంటే కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టినట్టే.

అంతకన్నా మించి సినిమాను థియేటర్స్ లో నడిపించలేని పరిస్థితులు ఉన్నాయి.అయితే ఇదంతా ఇప్పటి పరిస్థితులు.

కొన్ని రోజులు వెనక్కి వెళ్తే ప్రతి సినిమా 100 రోజులు లేదా 200 రోజులు ఆడేవి.

సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఘనంగా చేసుకునేవారు అప్పటి హీరోలు దర్శక నిర్మాతలు.

ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు.అయితే ఇండస్ట్రీలోనే రికార్డ్ సృష్టించిన విధంగా కొన్ని సినిమాలు ఏళ్లకు ఏళ్లు ఆడాయి.

అందులో మన తెలుగు సినిమాలతో పాటు కన్నడ సినిమా, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.

మరి అన్నేసి రోజులు సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారా అంటే ఎవరు చూడొచ్చారు.

ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా షో నడిపిస్తూ ఉండుంటారు లేదా రోజులో ఏదో ఒక షో వేస్తూ అలా కొనసాగిస్తూ ఉండుంటారు.

మొత్తానికి చాలా ఏళ్ల పాటు సినిమాలను థియేటర్స్ లో అలా నడిపించారు.ఇంతకీ ఆ సినిమాలేంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర డైరెక్షన్ లో శివరాజ్ కుమార్ హీరోగా అప్పట్లో ఓం ( Om )అనే ఒక సినిమా వచ్చింది.

దీనిని ఇప్పటి వరకు 750 సార్లు ఈ చిత్రాన్ని విడుదల చేశారట.ఈ మధ్య ఒకటి రెండు సినిమాలు రిలీజ్ జరుపుకుంటున్నాయి.

అప్పట్లో ఆడని సినిమాలను ఇప్పుడు థియేటర్స్ లో విడుదల చేసి నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు.

ఈ లెక్క ప్రకారం చూస్తే ఓం సినిమా ఎన్నో ఏళ్ల పాటు నిరంతరాయంగా నడుస్తూనే ఉంది.

అయితే ఇదే సినిమాను తెలుగులో ఉపేంద్ర దర్శకత్వంలోనే రాజశేఖర్ హీరోగా అదే పేరుతో రిలీజ్ చేయగా బిలో యావరేజ్ గా నిలిచింది.

అదండీ సినిమా మహత్యం.ఇక దాదాపు 20 ఏళ్ల పాటు ఓం సినిమా నడిచిన చరిత్ర ఉండగా హిందీలో దిల్వాలే దుల్హనియా లేజాయేంగే( Dilwale Dulhania Le Jayenge ) సినిమా కూడా దాదాపు 20 ఏళ్లకు పైగా నడిచింది.

"""/" / ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో మొదట ఈ సినిమా విడుదలయి అక్కడే దాదాపు 1009 వారాలపాటు నడుస్తూనే ఉంది.

కేవలం మార్నింగ్ షో మాత్రమే వేస్తూ ఈ సినిమాను ఇన్నాళ్లపాటు లాక్కుంటూ వచ్చారు.

దీనిని అఫీషియల్ గా 2015లో చివరి షో వేసి నిలిపివేశారు.ఇక మన బాలకృష్ణకు కూడా ఈ రికార్డులో స్థానం దక్కింది.

రాయలసీమలోని ఒక థియేటర్లో బాలకృష్ణ( Balakrishna ) నటించిన ఏదో ఒక చిత్రాన్ని దాదాపు ఐదేళ్ల పాటు నడిపించి ఒక రికార్డు సృష్టించారట.

అలా ఈ మూడు సినిమాలు థియేటర్లలో ఏళ్లకు ఏళ్ళు నడిచి రికార్డ్స్ సృష్టించాయి.

కానీ కలెక్షన్స్ గురించి మాత్రం క్లారిటీ లేదు.ఇప్పుడైతే వారంలో సినిమా కలెక్షన్ గట్టిగా జరిగి బడ్జెట్ మొత్తం వచ్చేస్తుంది.

ఏపీలో స్టూడియోల నిర్మాణంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!!