ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సినిమా థియేటర్.. ఎక్కడంటే..?!
TeluguStop.com
సాధారణంగా మనం సినిమా చూడాలంటే ఐమాక్స్ లేదంటే దగ్గర్లోని థియేటర్ కు వెళ్తాం.
హాయిగా సినిమా చూస్తాం.ఆ తర్వాత ఇంటికి చేరుకుంటాం.
అయితే ఇక్కడ ఒక అద్భుతమైన థియేటర్ గురించి మీరు తెలుసుకోవాలి.సుమారుగా సముద్ర మట్టానికి 11,562 అడుగుల ఎత్తులో ఓ కొండ పైన మూవీ థియేటర్ ను ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉండే థియేటర్ గా చరిత్రకెక్కింది.ఇక్కడ ఉష్ణోగ్రత చూస్తే -28 డిగ్రీలు ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
నిజానికి ఇలాంటి చోట మనిషి బతకడం చాలా కష్టం.కానీ ఈ ప్రాంతంలో థియేటర్ ఏర్పాటు చేసి అందులోనూ ఇండియాలో ఏర్పాటు చేసి ఔరా అనిపించారు.
లడక్ లోని లెఫ్ట్ లో కొండమీద థియేటర్ ఉంది.పిక్సర్ టైమ్ డిజిప్లెక్స్ అనే సంస్థ థియేటర్ ను ఏర్పాటు చేసింది.
ఇది ఒక మొబైల్ థియేటర్.రిమోట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సినిమా వినోదం పంచడమే దీని ప్రధాన ఉద్దేశం.
థియేటర్లో మొదటగా ఎకూల్ అనే షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. """/"/
లడక్ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఇది చాలా దగ్గరగా ఉన్న షార్ట్ ఫిలిం.
ఇక్కడున్న సంచార జాతి మనుషుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.అక్కడ సైనికుల కోసం ఈ సినిమాను ప్రదర్శించారు.
అయితే ఈ థియేటర్లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన బెల్ బాటమ్ సినిమా ప్రదర్శితమైంది.
ఆ తర్వాత త్వరలోనే లడక్ ప్రాంతంలో ఇంకొన్ని మొబైల్ థియేటర్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని పిక్చర్స్ టైం సంస్థ తెలిపింది.
ఈ థియేటర్ ను గాలితో నింపిన మెటీరియల్ తో ఏర్పాటు చేశారు.ఇది ఒక వాటర్ ఫ్రూఫ్ థియేటర్.
ఇక్కడ టెంపరేచర్ కూడా మైనస్ డిగ్రీలో ఉన్నా కూడా పడకుండా ఉంటుంది.థియేటర్ ఎంత గాలికైనా చలికైనా తట్టుకుని నిలబడ గలుగుతుంది.
థియేటర్ లోపల ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగదు.ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని టైమ్ పిక్చర్స్ తెలియజేసింది.
ప్రస్తుతం ఈ థియేటర్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన థియేటర్ గా రికార్డుకెక్కింది.
ఈ ఇయర్ కి భారీ ఎండింగ్ ఇస్తున్న అల్లు అర్జున్…