బాహుబలి2 స్థాయిలో ఆ సీక్వెల్స్ మెప్పు పొందుతాయా.. దేవర2, కల్కి2, పుష్ప2 పరిస్థితేంటి?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి సినిమా( Baahubali Movie ) తర్వాత చాలావరకు దర్శకులు ఎక్కువ శాతం మంది సీక్వెల్స్ వెంటపడుతున్నారు.
సినిమాలను రెండు పార్ట్ లుగా తెరకెక్కించడం అన్నది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది.
అయితే బాహుబలి సినిమా సమయంలో బాహుబలి 2 సినిమా( Baahubali 2 Movie ) కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారు మనందరికీ తెలిసిందే.
కానీ ఆ సినిమా తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులు సీక్వెల్స్ కోసం వెయిట్ చేయడం లేదు.
బాహుబలి తర్వాత చాలా సినిమాలు సీక్వెన్స్ లో వచ్చినప్పటికీ బాహుబలి 2 కోసం వెయిట్ చేసినట్టుగా ప్రేక్షకులు మిగతా సినిమాల విషయంలో అంత ఆతృత చూపించడం లేదు.
"""/" /
సలార్ 1 ( Salar 1 )తర్వాత సలార్ 2లో శౌర్యంగా పర్వ కోసం ప్రభాస్ కోసం ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
మిగతా ప్రేక్షకుల్లో ఎంత అంచనాలు ఉన్నాయో చెప్పడం కష్టం.అలాగే పుష్ప పార్ట్ 1 చక్కగా ముగిసింది.
దానికి సీక్వెల్ పుష్ప 2 ( Pushpa 2 )రాబోతుంది.కానీ అది సీక్వెల్‌గా ఎవ్వరికి కనిపించడం లేదు పుష్ప 1 హిట్ అయ్యింది.
ఆ తర్వాత 2 లో ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ తప్ప ఇంకేం లేదు.
ఇక కల్కి 2( Kalki 2 ) పై కూడా కొట్టేసుకునేంత క్రేజ్ అయితే లేదు.
ఇప్పుడు దేవర రిలీజ్ అయ్యింది.దానికి పార్ట్ 2 ఉంటుంది అని ప్రకటించారు.
బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 పై ఉన్న ఇంపాక్ట్ దేవర 2( Devara 2 ) పై ఉందా, దేవర సీక్వెల్ కోసం జనాలను వెయిట్ చేయించే ఇంట్రెస్టింగ్ కథ దేవర2 లో ఉందా, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప దేవర 2 కోసం ఎవరూ పెద్దగా ఆలోచన చెయ్యడం లేదు.
"""/" /
అందరూ పార్ట్ 1, 2 అంటూ పార్ట్ 1లో సాగదీసే కథలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.
పార్ట్ 2 కోసం కథను దాచేసుకుని అడ్డమైన సన్నివేశాలను మొదటి భాగంలో పెడుతున్నారు.
దానితో లాగ్ సీన్స్, అవి చూసి ప్రేక్షకులకు చిరాకు వస్తోంది.ఈ విషయం దేవరకు కూడా వర్తిస్తుందనీ చెప్పాలి.
ఇకపోతే దేవర 2 కోసమై ఏ మేర అంచనాలు ఉన్నాయో అనేది చూడడానికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే ఆగాల్సి ఉంటుంది.