'మా' ఎన్నికల్లో ఓటుకు నోటు.. ఎన్ని వేలు ఇస్తున్నారంటే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే సాధారణ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు జరుగుతుందని అందరికీ తెలుసు.అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో సైతం ఓటుకు నోటు కార్యక్రమం జరుగుతోందని వినిపిస్తోంది.

ఒక ఓటుకు పదివేల రూపాయల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది.మొత్తం 900 ఓట్లు ఉండగా 150 మంది వరకు ఈ విధంగా డబ్బులు అందాయని సమాచారం.

ఓటుకు పదివేల రూపాయలు అంటే తక్కువ మొత్తం కాదు.అయితే ఏ సెలబ్రిటీ ఈ డబ్బులను ఇచ్చారనే ప్రశ్నకు మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో సమాధానం దొరకడం లేదు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యులైన వాళ్లలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు.

అలాంటి నటులు ఎక్కువగా ఓటును అమ్ముకుంటున్నారని తెలుస్తోంది.వీళ్ల ఓట్లే కీలకం కావడంతో ఓట్ల కోసం అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

"""/"/ అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఇటు విష్ణు ప్యానెల్ నుంచి వేర్వేరు పదవులకు పోటీ చేస్తున్న వాళ్లకు సైతం గెలుపు ఎంతో ముఖ్యమనే విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో గరిష్టంగా 500 ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది.ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉండటం ప్లస్ అవుతోంది.

"""/"/ ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఎక్కువమంది భావిస్తున్నారు.మోహన్ బాబు విష్ణు గెలుపు కోసం పలువురు సెలబ్రిటీలకు కాల్ చేస్తున్నారు.

మరోవైపు 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారి కోసం బ్యాలెట్ పేపర్ కు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా మంచు విష్ణు తరపు వ్యక్తి 56 మంది సభ్యులకు సంబంధించిన ఫీజు చెల్లించడంపై ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు.

వేసవిలో మీ జుట్టు మరింత అధికంగా ఊడుతుందా.. వర్రీ వద్దు ఇలా చెక్ పెట్టండి!