మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన సినీ ప్రముఖులు వీళ్లే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించినా విష్ణు సునాయాసంగా ఎన్నికల్లో విజయం సాధించారు.

మంచు విష్ణు అధ్యక్ష పీఠానికి ఎన్నిక కావడంతో తన ప్యానెల్ సభ్యులను సైతం గెలిపించుకున్నారు.

మంచు విష్ణు ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన రఘుబాబు జీవితా రాజశేఖర్ పై 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

విష్ణు ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవికి మాదాల రవి ఎంపికయ్యారు.ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ , మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబు మోహన్ పోటీ పడగా హోరాహోరీ పోరులో చివరకు శ్రీకాంత్ విజయం సొంతం చేసుకున్నారు.

ట్రెజరర్ పదవికి ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి నాగినీడు, విష్ణు ప్యానల్ నుంచి శివబాలాజీ పోటీ చేయగా శివబాలాజీ 32 ఓట్ల ఆధిక్యంతో నాగినీడుపై విజయం సాధించారు.

"""/"/ మంచు విష్ణు ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీ పదవికి గౌతమ్ రాజు ఎంపికయ్యారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన ఉత్తేజ్ విజయం సాధించారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ విజయం సాధించారు.

మంచు విష్ణు ప్యానల్ నుంచి హరినాథ్, మాణిక్, బొప్పన విష్ణు, శ్రీలక్ష్మీ, శ్రీనివాస్, పూజిత, శశాంక్ ఈసీ మెంబర్స్ గా విజయం సాధించారు.

"""/"/ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి కౌశిక్, శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి విజయం సాధించారు.

బ్రహ్మాజీ, సంపూర్ణేష్ బాబు, ఖయ్యూమ్ ఈసీ మెంబర్స్ గా గెలిచినట్లు సమాచారం అందుతోంది.

ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెందిన 11 మంది ఈసీ మెంబర్లుగా గెలవగా విష్ణు ప్యానల్ కు చెందిన 7 మంది మాత్రమే ఈసీ మెంబర్స్ గా ఎన్నికయ్యారు.

రాత్రి సమయంలో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?