కేటీఆర్- ప్రకాష్ రాజ్ పొలిటికల్ ట్విట్స్ .. ఎంపీగా పోటీ
TeluguStop.com
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగి రాజకీయాలను కాచి వడబోయ్యాలని సీని నటుడు ప్రకాష్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దీనిలో భాగంగానే.సోషల్ మీడియాతో కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు సినీనటుడు ప్రకాష్‌రాజ్.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 'ప్రజా జీవితంలో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్న ప్రకాష్‌రాజ్‌కు అభినందనలు.
సానుకూల మార్పు తీసుకురావడానికి మీ ప్రయాణం ఉపయోగపడాలి' అంటూ ప్రకాష్‌రాజ్ పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై స్పందించిన ఆయన.
తన రాజకీయ ప్రయాణానికి స్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.తన రాజకీయ ఆరంభం ఎవరికీ వ్యతిరేకంగా కాదని, సమాజం కోసమే.
ఇక పార్లమెంట్‌లో కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా నంటూ ట్వీట్ చేశారు ప్రకాష్‌రాజ్.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
గతంలో కేటీఆర్‌ను కలిసిన సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను ట్వీట్‌కు జోడించారు ప్రకాష్‌రాజ్.
ఇప్పుడిది కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.ప్రకాష్‌రాజ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? అనే చర్చ సాగుతోంది.
మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ప్రకాష్ రాజ్ పోటీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్25, బుధవారం 2024