బీసీ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం ఆగదు: ధనుంజయ నాయుడు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం ఆగదని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాల ధనుంజయ నాయుడు శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.
అనేక దశాబ్దాలుగా బీసీలు బీసీ బిల్లు కోసం ఉద్యమిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని మండిపడ్డారు.
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ తరహా లో బీసీ అట్రాసిటీ చట్టం కూడా తేవాలని,కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణలలో బీసీ జనగణన చేపట్టాలని కోరారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లను 52 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీలంతా ఏకతాటిపై వచ్చి ఉద్యమించాలని కోరారు.
ఈయనతో బీసీ హక్కుల సాధన సమితి నాయకులు రావుల సత్యం,చిలకరాజు శ్రీను పాల్గొన్నారు.
ఒకే గొంతు.. ఒకే మాట.. వైరల్ అవుతున్న ఆస్ట్రేలియా కవలలు..