వేసవిలో మౌత్ అల్సర్ తరచూ వేధిస్తుందా..అయితే ఈ టిప్స్ మీకే!
TeluguStop.com
చలి కాలం పోయి వేసవి కాలం రానే వచ్చింది.మార్చి నెల నుంచే ఎండలు మండిపోతుండడంతో.
ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అయితే ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో మౌత్ అల్సర్ (నోటి పూత) ఒకటి.
శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తరచూ ఈ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది.ఇక మౌత్ అల్సర్ వచ్చిందంటే భరించలేనంత నొప్పి, మంట పుడుతుంది.
ఈ సమయంలో ఆహారాన్నే కాదు.కనీసం వాటర్ తాగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది.
అయితే ఈ కొన్ని టిప్స్ పాటిస్తే వేసవిలో వేధించే మౌత్ అల్సర్‌ను సులువుగా మరియు త్వరగా నివారించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.డీహైడ్రేషన్, శరీరం అధిక వేడికి గురి కావడం వల్ల సమ్మర్‌లో మౌత్ అల్సర్ ఎక్కువగా ఏర్పడుతుంది.
ఈ సమస్యకు చెక్ పెట్టడంలో కొబ్బరి అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతి రోజు కొబ్బరి నీరు సేవించడం, కొబ్బరి నూనెను పుండ్లు ఉన్న చోట అప్లై చేయడం, ఎండు కొబ్బరి తరచూ నమలడం చేస్తే త్వరగా మౌత్ అల్సర్ దూరంఅవుతుంది.