రై రైమంటూ బైక్‌పై 114కి.మీ స్పీడ్.. వీడియో రికార్డు చేయబోయి స్పాట్ డెడ్!

తాజాగా చెన్నైలోని ఇద్దరు టీనేజ్ అబ్బాయిలు గంటకు 114 కి.మీ వేగంతో బైక్‌పై దూసుకెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.

దాంతో వారు అక్కడికక్కడే మరణించారు.వారు తమ ఫాస్ట్ రైడ్‌ను వీడియో రికార్డ్ చేయాలని అనుకున్నారు.

తమ హెల్మెట్‌కు ఓ చిన్న కెమెరాలో కూడా అమర్చారు.ఆపై బిజీగా ఉన్న ఒక రోడ్డుపై శరవేగంగా దూసుకెళ్లారు.

5-10 సెకన్ల సమయంలోనే 114 కి.మీ/అవర్ వేగాన్ని చేరుకున్నారు.

ఇంతలోనే తమ ముందు ఒక మినీ వ్యాన్ టర్నింగ్ తీసుకుంది.దానిని కచ్చితంగా ఢీకొడతామనే భయంతో వెంటనే రైడర్ బైక్‌ను చాలా వేగంగా పక్కకు తిప్పాడు.

అంతే మిల్లి సెకన్లలో బైక్ డివైడర్‌ను బలంగా గుద్దుకుంది.హెల్మెట్ ఒక్కసారిగా కింద పడిపోయింది.

అంతే బైక్ పై ఉన్న ఇద్దరూ మరణించారు.డిసెంబర్ 1న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరణించిన యువకులను తారామణికి చెందిన 17 ఏళ్ల హరి, 19 ఏళ్ల ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు.

వారు నవంబర్ 29న సమీపంలోని 100 అడుగుల రహదారిపై రైడ్ కోసం వెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యువకులు OMR వైపు రైడ్‌కి వెళ్లి కెమెరాలో తమ హై స్పీడ్ రైడ్‌ను రికార్డ్ చేయాలనుకున్నారు.

స్పష్టంగా, యువకులు తమ రైడ్ ప్రారంభించిన 21 సెకన్ల తర్వాత ఘోరమైన క్రాష్ జరిగింది.

"""/"/ హరి తన 12వ తరగతి పూర్తి చేశాడు.ప్రవీణ్ ఇంటర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

కొన్ని నెలల క్రితం, ప్రవీణ్ తల్లిదండ్రులు అతని కోసం ఒక బైక్ కొనుగోలు చేశారు.

కాగా ఆ 19 ఏళ్ల యువకుడికి ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు.

యాక్సిడెంట్ జరిగాక యువకులను రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.అతివేగం ప్రాణాలకు ప్రమాదకరమని పోలీసులు ఎంత చెప్తున్నా.

చాలామంది థ్రిల్ కోసం అతివేగంగా దూసుకెళ్తున్నారు.దీనివల్ల ప్రాణాలను కోల్పోతున్నారు.

శనగ పంటలో పోషక ఎరువుల యాజమాన్యం.. పంట విత్తుకునే విధానం..!