బిడ్డ ఏడుస్తుందని పాల బాటిల్ లో మద్యం నింపిన కర్కోటక తల్లి!
TeluguStop.com
ఆశ్చర్యంగా వుంది కదా.దారుణం అని ఫీల్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే.
కాలిఫోర్నియాలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన ఇపుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.కన్నతల్లి ప్రేమ గురించి మనం ఎన్నో రకాలుగా వుంటూ ఉంటాం.
కానీ ఇక్కడ తల్లి మాత్రం తన కర్కోటక హృదయాన్ని బయలు పరిచింది.శాన్ బెర్నార్డినో కౌంటీకి చెందిన ఒక మహిళ తన పసికందు ఏడుపును ఆపడానికి బిడ్డకు పట్టే పాల బాటిల్( Milk Bottle ) లో మద్యం నింపి ఇవ్వడం ఇపుడు పెను సంచలనంగా మారింది.
దాంతో పిల్లలను ప్రమాదంలో పడేశిందంటూ ఆమె మీద పోలీసులు అభియోగాలు మోపారు. """/" /
లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, 37 ఏళ్ల వయస్సు కలిగిన హోనెస్టి డి లా టోర్రే శనివారం రియాల్టోలోని ఓ ఆస్పత్రికి తన బిడ్డను తీసుకు వెళ్లింది.
ఆ సమయంలో చిన్నారి "మత్తులో" ఉన్నట్లు డాక్టర్లు గమనించారు.దీంతో ఆమెను ఆరా తీయగా నిజం ఒప్పుకుంది.
వెంటనే తల్లిని అరెస్టు చేశారు.శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ మాట్లాడుతూ, మహిళ రియాల్టో నుండి డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఆ సమయంలో పాప ఏడుపును ఆపడానికి ప్రయత్నించింది.
దీనికోసం పాపకు పట్టే బాల బాటిల్ లో తాను తాగే మద్యం పోసి ఇచ్చిందని చెప్పారు.
దాంతో 37 ఏళ్ల మహిళకు ఈ నేరం కింద 60,000 డాలర్ల బాండ్‌పై వెస్ట్ వ్యాలీ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.
"""/" /
ఆమె త్వరలో కోర్టుకు హాజరు కావచ్చని న్యూయార్క్ టైమ్స్( New York Times ) నివేదించింది.
ఇక ఆ చిన్నారి పరిస్థితి గురించి తెలియాల్సి వుంది.ఈ విషయం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది.
మరోవైపు మీడియాలో కూడా ఆమెపైన పెద్ద ఎత్తులో విమర్శలు వస్తున్నాయి.ఆ సమయంలో పాలు లేకుండా ఉండొచ్చుగాక, కానీ దానికి ప్రత్యామ్నాయం అది కాదని అంటున్నారు.
ఇక మరో దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఓహియో( Ohio )లో ఓ తల్లి తన 16 నెలల పసికందుని హతమార్చింది.
ప్యూర్టో రికో డెట్రాయిట్ పర్యటనకు వెడుతూ.శిశువుని ఇంటి లోపలే ఒంటరిగా వదిలేసి వెళ్లింది.
దీంతో చూసుకునేవారు లేక చిన్నారి ఆకలితో అలమటించి మృతి చెందింది.దాంతో 31 ఏళ్ల వయస్సు గల క్రిస్టెల్ కాండెలారియో అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.