టీవీ చూస్తోందని కూతురును చితకబాదిన తల్లి.. చివరకు..?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అమానుషంగా వ్యవహరిస్తున్నారు.పిల్లలు చిన్న తప్పు చేసినా కఠినంగా శిక్షిస్తున్నారు.
ప్రేమగా చూసుకోవాల్సిన పిల్లలను చిత్రహింసలు పెడుతున్నారు.మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
కూతురు చదవకుండా టీవీ చూస్తోందని కన్నతల్లే రాక్షసంగా వ్యవహరించింది.చిన్న పాప అని కూడా చూడకుండా చితకబాదింది.
ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన కూతురు విషయంలో దారుణంగా వ్యవహరించింది.తల్లి కూతురును దారుణంగా కొడుతుండగా స్థానికులు రికార్డ్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో కూతురును తల్లి కొడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు కూతురి పట్ల కరుణ లేకుండా వ్యవహరించిన తల్లిని కఠినంగా శిక్షించాలని కామెంట్లు చేస్తున్నారు.
జిల్లాలోని చిన్నగూడూరు మండలం మేగ్యతండాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో తల్లిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తండాలో నివశించే గిరిజన మహిళ కూతురు ఈ సంవత్సరం పదో తరగతి చదువుతోంది.
తల్లి ఎన్నిసార్లు సూచనలు చేసినా కూతురు చదువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి టీవీ చూడసాగింది.
దీంతో కోపంతో ఊగిపోయిన మహిళ కాలితో తొక్కుతూ రోకలితో బాదుతూ కూతురు ఎంత వేడుకున్నా కరగకుండా బాధ పెట్టింది.
ఇంట్లో వస్తువులు కూతురి నిర్లక్ష్యం వల్లే మాయమవుతున్నాయని దారుణంగా తిట్టింది.తల్లితో పాటు బాలిక తమ్ముడు కూడా మహిళపై దాడి చేయడం గమనార్హం.
విషయం చివరకు పోలీసులకు తెలిసి బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
పిల్లల విషయంలో ప్రేమగా వ్యవహరించాలని కౌన్సిలింగ్ ఇచ్చి మహిళను ఇంటికి పంపించారు.మానసిక నిపుణులు ఈ ఘటన గురించి స్పందిస్తూ తల్లిదండ్రులు పిల్లలకు ఏ విషయాన్నైనా అర్థమయ్యేలా వివరించి చెప్పాలని.
పిల్లలను తిడుతూ, కొడుతూ చితకబాదుతూ చెప్పడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా కలుగుతుందని తెలుపుతున్నారు.
అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటి..?