వీడియో: రీల్స్‌లో తల్లి బిజీ.. ఆమె బిడ్డ బిజీ రోడ్డు వైపు వెళ్లడంతో..?

ఈ రోజుల్లో చాలామంది ప్రజలు సోషల్ మీడియా మోజులో పడి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.

ఫేమస్ కావాలని, వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.కానీ, ఈ క్రేజ్‌లో చాలామంది తమ ప్రాణాలనే కాదు ఇతరుల ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు.

అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆ తల్లులు కూడా రీల్స్( Reels ) పైత్యంతో చాలా కోపం తెప్పిస్తున్నారు.

తాజాగా ఒక తల్లికి( Mother ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇందులో ఆ తల్లి రోడ్డు పక్కన నేచురల్‌గా డ్యాన్స్( Dance ) చేస్తుంది.

ఆమె కూతురు( Daughter ) రోడ్డు మీదకి వెళ్తున్న దాన్ని గమనించకుండా, ఫోన్‌లో రీల్ చేయడం పైనే దృష్టి పెట్టింది.

"""/" / అదృష్టవశాత్తు, ఆమె కొడుకు ఆ చిన్నారి రోడ్డు మీదకు వెళుతుందని తల్లిని వెంటనే అలెర్ట్ చేశాడు.

ఈ వీడియోను "Ghar Ke Kalesh" అనే అకౌంటు హోల్డర్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.ఇది ఓపెన్ చేస్తే మనకు ఇద్దరు పిల్లల తల్లి ‘బ్రదర్ లూయి’ పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ చేయడం కనిపిస్తుంది.

ఆమె ఇద్దరు పిల్లలు ఆమె వెనుక ఉన్నారు.ఆమె కొట్టి దూరంలో ఒక బిజీ రోడ్డు( Busy Road ) ఉండే దానిపై వాహనాలు చాలా వేగంగా వెళుతున్నాయి.

అయితే తల్లి రిల్స్‌ చేయడంలోనే నిమగ్నం కాగా, కూతురు రోడ్డు వైపుకు వెళ్లడం ప్రారంభించింది.

ఈ విషయాన్ని గమనించిన కొడుకు తన తల్లి దగ్గరికి వెళ్లి ఆమెను చేతితో తట్టాడు.

చెల్లి అటు వెళ్లిపోతుందంటూ తల్లికి తెలియజేశాడు.వెంటనే ఆ తల్లి అటువైపుగా ఊరికి రోడ్డుపైకి చిన్నారి వెళ్లకుండా ఆపగలిగింది.

దాంతో పెను ప్రమాదం తప్పింది. """/" / ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో చూసిన వారందరూ ఆ తల్లిని తప్పుబడుతున్నారు.

ఒక చిన్న వీడియో కోసం తన బిడ్డ ప్రాణాన్ని ముప్పులో పెట్టడం పిచ్చి పొరపాటు అని అంటున్నారు.

"నీ రీల్‌ని ఎవరూ అంతగా పట్టించుకోరు, కానీ నీ బిడ్డను నిర్లక్ష్యం చేస్తే ఆ లాస్ నీ జీవితాంతం ఉంటుంది" అని ఒకరు కామెంట్ చేశారు.

మరొకరు, "రీల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ భద్రత ఎప్పుడూ ముఖ్యం.ఫోన్ కెమెరా ద్వారా కాకుండా, ప్రేమతో జ్ఞాపకాలను ఏర్పరుచుకోవాలి.

" అని అన్నారు.