వైరల్: సాక్స్‌లు లేకపోతే ఏం… ఇలా ఎపుడైనా ఆలోచించారా?

మనలో కొంతమంది రోజూ చేసే పనులే అయినప్పటికీ వాటిని అందరిలా కాకుండా అదే పనులను ఎవరూ చేయని విధంగా, భిన్నంగా చేస్తూ అందరినీ అవాక్కయేలా చేస్తూ ఉంటారు.

మరికొందరు అతి తెలివితో వ్యవహరిస్తూ చేసే పనులు కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.

సోషల్ మీడియా ప్రాచుర్యం బాగా పెరిగాక ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్( Viral Video ) అవుతున్నాయి.

తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొట్టడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

"""/" / అవును, ఓ మహిళ తన కుమారుడికి సాక్స్‌లు( Socks ) లేకపోవడంతో ఆమె చేసిన ప్లాన్ చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఈ వీడియోను చూసిన వారంతా."ఈమె తెలివికి జోహార్లు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వీడియోని గమనించినట్లయితే.వీడియోలో ఓ మహిళ తన కొడుకును స్కూల్‌కు( School ) పంపేందుకు రెడీ చేస్తుంటుంది.

ఈ క్రమంలో స్నానం చేయించి, స్కూల్ యూనిఫాం వేసి రెడీ చేసింది.అయితే షూలు వేసే సమయంలో సాక్స్‌లు లేకపోవడంతో ఎలాగైనా సాక్స్‌లు రెడీ చేయాలని ఆమె అలోచించి, తన బుర్రకు పదును పెట్టింది.

ఈ క్రమంలోనే సాక్స్‌లు లేకున్నా.ఉన్నట్లు భ్రమ కలిగించేందుకు ప్లాన్ చేసింది.

"""/" / అవును, దానికోసం ఆమె ఓ వంట పాత్రను తీసుకుని, దాని కింద ఉన్న మసిని పిల్లాడి కాళ్లకు నిండా పూసేసింది.

సాక్స్‌ల ఆకారంలో ఆమె మసిని తన కొడుకు పాదాలకు మసిని పూయడంతో ఎవరికీ అనుమానం రాదు అని ఆలోచించింది.

కాగా ఇలా రూపాయి ఖర్చు లేకుండా సాక్స్‌లను సిద్ధం చేసిన ఈ మహిళను చూసి అంతా అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

"ఎలా వస్తాయండీ ఇలాంటి ఐడియాలు?" అని కొందరు కామెంట్ చేస్తే.మరి కొందరు, "ఇలాంటి సాక్స్‌లను చూడడం ఇదే మొదటిసారి!".

అని, ఇంకొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ వీడియో ప్రస్తుతం 1500 వందలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

జుట్టు రాలడం, చుండ్రు.. ఈ 2 సమస్యలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఇది..!