దారుణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకునే చంపించిన తల్లి....

వివాహేతర సంబంధాల మోజులో పడి వారికి అడ్డుగా ఉన్నాడని  తన సొంత కొడుకునే చంపుకుంది ఓ కసాయి తల్లి.

ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగింది.వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందిన తెనాలిలోదంపతుల వారి కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు.

వారి కొడుకు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా ఇందులో యువకుడు తల్లికి తన పెళ్ళికి ముందు నుంచి బాలస్వామి అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.

దీంతో ఆమె తరచూ బాలస్వామిని కలుస్తూ ఉండేవాడు.తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ యువకుడు ఆమెను అక్రమ సంబంధంపై నిలదీశాడు.

 దీంతో  ఆ కసాయి తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నట్లు భావించి అతడిని చంపాలని తన ప్రియుడైన బాలస్వామితో కలిసి పన్నాగం పన్నింది.

ఇదులో భాగంగా కాలేజీ కి వెళ్లిన తన కొడుకుని నందివెలుగు హైవే రోడ్డుపైకి రమ్మని ఫోన్ చేసి పిలిపించారు.

తర్వాత ఆమె మరియు తన కొడుకు, ఆమె ప్రియుడు బాలస్వామి ముగ్గురూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి ఓ షాప్ కి వెళ్లి అల్పాహారం చేశారు.

"""/"/ అనంతరం ఆమె తన కొడుకుని బాలస్వామి దగ్గర విడిచి పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది.

దీంతో బాలస్వామి ఆ యువకుడిని తన వెంట తీసుకెళ్లి తాడుతో గొంతుకి బిగించి హత్య చేసి కాళ్ళు, చేతులు కట్టి పడేసి దగ్గర్లో ఉన్నటువంటి కాలువలో పడేశాడు.

ఆ తర్వాత ఆమె ఏమీ ఎరగనట్లు దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది.

అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో మరియు ఆమెను ఆమె ప్రియుడు బాలస్వామిని అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.

చిరంజీవి రామ్ పొతినేని కాంబోలో రావాల్సిన మల్టీ స్టారర్ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే..?