మాతృత్వానికే మాయనిమచ్చ.. ప్రియుడిమోజులో కన్నబిడ్డనే కాటికి పంపిన తల్లి..!
TeluguStop.com
ఓ తల్లి తన వివాహేతర సంబంధానికి(Illegal Affair) కన్న కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి హత్య చేసింది.
ఈ భూమి మీద మాతృత్వం కంటే గొప్పది ఏదీ లేదు.అటువంటి మాతృత్వానికే ఈ సంఘటన ఓ మాయని మచ్చ.
పోలీసుల వివరాల ప్రకారం గుజరాత్ లోని (Gujarat) సావర్కుండ్ల ప్రాంతానికి చెందిన సలీం భాయ్, హుస్సేనా కు 8 సంవత్సరాల క్రితం వివాహం అయింది.
వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.ఒక కొడుకుకు నాలుగు సంవత్సరాలు రెండో కొడుకుకి రెండు సంవత్సరాల వయసు.
ఇక భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే.హుస్సేనా మూడు సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి రాజ్ కొట్ లోని తన పుట్టింటికి వచ్చేసింది.
"""/" /
సలీం భాయ్ పిల్లల మీద ప్రేమతో రాజ్ కోట్ లో అత్తారింటికి సమీపంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నాడు.
సలీం భాయ్ మీద కోపంతో భార్య తరచూ పిల్లలను కొడుతూ ఉండడంతో, సలీం బాయ్(Saleem Bhai) తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు.
ఒంటరిగా ఉన్న హుస్సేనా కు జాకీర్ (Jakeer) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇక చిన్న కుమారుడు ఆర్యన్ ను తీసుకొని ప్రియుడుతో కలిసి వాద్వాన్ ప్రాంతంలో నివసిస్తోంది.
ప్రియుడితో కలిసి రెండేళ్ల ఆర్యను తరచూ కొట్టేది.ఈ క్రమంలోనే మార్చి 8న ఒక బలమైన వస్తువుతో ఇద్దరు ఆ పసివాడిని కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
"""/" /
చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు పిలిచాడు.బాలుడి అంత్యక్రియలకు వచ్చిన సలీం భాయ్, బాలుడి వీపుపై, కడుపుపై తీవ్ర గాయాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకుని ఫోరెన్సిక్ బృందంతో మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు పోలీసులు.
బాలుడిని గొంతు నులిమి చంపినట్లు బయట పడడంతో ప్రియుడు జాకీర్, తల్లి హుస్సేనా లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
విచారణలో ఇద్దరూ హత్య చేసినట్లు అంగీకరించారని, వీరిపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మోక్షజ్ఞపై డైరెక్టర్ బాబీ ప్రశంసల వర్షం.. ఈ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా?