అమ్మా, నానమ్మలే ఆ పసిపల్ల నోట్లో మట్టి నింపారు.. ఆ తర్వాత శ్మశానంలో పాతిపెట్టారు!

కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, నానమ్మలే ఆ బాలిక పాలిట యమదూతలుగా మారారు.

చిన్న పాప అని కూడా చూడకుండా చంపేందుకు ప్రయత్నించారు.ఏమాత్రం మానవత్వం లేకుండా నోట్లో మట్టి నింపి మరీ.

గోతి తవ్వి అందులో పాతిపెట్టారు.అయితే ఈ పాప అదృష్టం కొద్దీ వారి చేతుల్లో చావకుండా బయట పడింది.

అసలు ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.బిహీర్ సారన్ లో మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ కలిసి మర్హా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో పాతిపెట్టారు.

అంతకంటే ముందు బాలిక నోట్లో మట్టి కుక్కారు.అయితే ఆ పాప విపరీతంగా ఏడవడంతో.

స్థానికులు అప్రమత్తమయ్యారు.ముందుగా దెయ్యం అనుకొని చాలా భయపడిపోయారు.

ఆ తర్వాత కొందరు యువకులు వచ్చి దైర్యంగా శబ్దం వస్తున్న చోటును పరికించి చూశారు.

మట్టిని తవ్వి చూశారు.అయితే అప్పటికీ బాలిక బతికే ఉండడంతో.

వెంటనే కోపా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.పోలీసులు బాలికకు ప్రథమ చికిత్స చేయించి అనంతరం ఆస్పత్రికి తరలించారు.

అయితే తన పేరు లాలీ అని.తన తండ్రి రాజు శర్మ, తల్లి రేఖా దేవి అని ఆ బాలిక చెప్తోంది.

అయితే అమ్మ, నానమ్మలే తనతు పాతి పెట్టారని చెప్తోంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.