కొత్త రుణం కావాలంటే ఆగాలంటున్న మోతె ఎస్బీఐ బ్యాంక్

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు సంతోషంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు.

సాగు సీజన్ జోరుమీదున్న సమయంలో పెట్టుబడి సాయం కోసం సూర్యాపేట జిల్లా మోతె మండల ఎస్బీఐ బ్యాంక్ లో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కొత్త రుణం కావాలంటే నెల రోజులకు పైగా పడుతుందని బ్యాంక్ అధికారులు చెప్పడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు.

వ్యవసాయ పనుల పెట్టుబడి సాయం కోసం కొత్త రుణాలు అడిగితే నెల రోజులు ఆగాలని చెప్పడం ఏంటని రైతులు వాపోతున్నారు.

సాగు సీజన్ ను దృష్టిలో ఉంచుకుని వెంటనే కొత్త రుణాలు వచ్చేలా ఎస్బీఐ బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

స్పిరిట్ సినిమా కోసం 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న ప్రభాస్…