టాలీవుడ్ ఇండస్ట్రీలో అండర్ రేటెడ్ కమెడియన్ ఇతనే.. అవకాశాలు ఇవ్వకపోవడమే శాపమంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం సులువు కాదు.ఎంతో కష్టపడితే మాత్రమే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం సాధ్యమవుతోంది.
అయితే ఎంతో టాలెంట్ ఉన్నా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోని సెలబ్రిటీలు ఎక్కువమంది ఉన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి అండర్ రెటెడ్ కమెడియన్లలొ సత్య ( Satya )ఒకరు.
ఈ కమెడియన్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి.అయితే ఈ కమెడియన్ తనకు ఇచ్చిన ప్రతి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు.
రంగబలి సినిమా( Rangabali ) ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ చేసేవాళ్లను ఇమిటేట్ చేస్తూ ఒక ప్రోమో విడుదలైంది.
ఏబీఎన్ రాధాకృష్ణ, జాఫర్, సురేష్ కొండేటి, జాఫర్, ఒక వెబ్ సైట్ కు చెందిన ముఖ్య వ్యక్తి ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఇమిటేట్ చేస్తూ విడుదలైన ప్రోమోకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడం గమనార్హం.
"""/" /
అయితే ఆ ప్రోమో కొంతమందిని హర్ట్ చేసిందని తెలిసి ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ విషయంలో మేకర్స్ వెనక్కు తగ్గారు.
ఆ వీడియో విడుదలై ఉంటే మాత్రం సెన్సేషన్ అయ్యి ఉండేది.సత్య చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు.
పాపులర్ టీవీ సీరియల్ అయిన అమృతంలో( Amrutham ) కొన్ని ఎపిసోడ్లలో సత్య కనిపించారు.
సత్య మెయిన్ రోల్ లో ఒక సినిమా తెరకెక్కినా ఆ సినిమా ఓటీటీలో విడుదలైంది.
"""/" /
సత్య టాలెంట్ ను గుర్తించి స్టార్ డైరెక్టర్లు ఆఫర్లు ఇస్తే మాత్రం ఈ కమెడియన్ కు తిరుగుండదు.
సత్య కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
స్టార్ డైరెక్టర్లు ఈ కమెడియన్ ను గుర్తించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
గాయాల పాలైన నటి రష్మిక మందన్న… అసలేం జరిగిందంటే?